అమెరికావ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్క్​లను ధరించేలా ఆదేశాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వైట్ హౌస్ మరోసారి తిరస్కరించింది. దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని వెల్లడించింది.అమెరికాలో మాస్క్​లను ధరించటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించింది శ్వేతసౌధం.

 

కరోనా కట్టడి, మాస్క్​ల వినియోగంపై వైట్ హౌస్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు న్యూజెర్సి డెమోక్రటిక్​ గవర్నర్​ ముర్ఫీ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల వైరస్​ మరింత ఉద్ధృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్ కూడా మాస్క్​ల తప్పనిసరిపై ఆదేశం ఇచ్చే నిర్ణయాన్ని తిరస్కరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: