కరోనా పై పోరుకు గిలీద్‌ సైన్సెస్‌ రెమ్‌డెసివిర్‌ డ్రగ్‌ సిద్దం..ఈ నెలలో భారత్ లోకి  తీసుకొస్తామని ప్రకటించిన  మైలాన్​ ఎన్​బీ సంస్థ.కొవిడ్‌-19 చికిత్సకు వాడుతున్న గిలీద్‌ సైన్సెస్‌ రెమ్‌డెసివిర్‌ డ్రగ్‌ జనరిక్‌ ఔషధాన్ని ఆవిష్కరించేందుకు తమకు అనుమతి లభించిందని మైలాన్‌ ఎన్‌బీ సంస్థ ప్రకటించింది. 100 మి.గ్రా. వయల్‌ ధర రూ.4,800గా ఉంటుందని వెల్లడించింది. డెస్‌రెమ్‌ పేరుతో ఈ నెల్లోనే విక్రయాలు ఆరంభిస్తామని పేర్కొంది. తమ ఔషధానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని తెలిపింది.

 


కొవిడ్‌-19 బాధితులకు వైద్యం చేసేందుకు భారత్‌లో ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇస్తున్నారు. దీంతో పాటు కొన్ని యాంటీ వైరల్‌ మందులు అందజేస్తున్నారు. అమెరికాలో జరిపిన కొన్ని పరిశోధనల్లో రెమ్‌డెసివిర్‌ తీసుకున్న రోగులు త్వరగా కోలుకుంటున్నారని గుర్తించడం వల్ల దానికి గిరాకీ పెరిగింది. భారత్‌ సహా అనేక దేశాలకు గిలీద్‌ సైన్సెస్‌ జనరిక్‌ ఔషధంగా విక్రయించుకొనేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే అత్యవసర పరిస్థితుల్లోనే భారత్‌లో దీనిని ఉపయోగిస్తున్నారు.ఇప్పటికే సిప్లా లిమిటెడ్‌ 'సిప్రెమి', హెటిరో 'కొవిఫర్‌' పేరుతో రెమ్‌డెసివిర్‌ను విక్రయిస్తున్నాయి. 

 

సిప్లా రూ.5000, హెటిరో రూ.5,400గా ధరను నిర్ణయించాయి. సంపన్న దేశాల్లో ఒక్కో రోగి నుంచి రెమ్‌డెసివిర్‌ కోసం గిలీద్‌ 2,340 డాలర్లు వసూలు చేస్తోంది. భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, జూబిలెంట్‌, సింజెన్‌, జైడస్‌ క్యాడిలాకు ఆ సంస్థ‌ విక్రయ అనుమతలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: