ముఖ్యమంత్రి జగన్‌... ఇవాళ, రేపు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం... రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు సీఎం తండ్రి వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి జయంతి కాగా.. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో వైఎస్​ఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన అకడమిక్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం, 3 మెగావాట్లతో నిర్మించే సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎస్పీ అన్బురాజన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి.. జగన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్న ఎస్పీ... కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

 


చిరు/విధి వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించే 'జగనన్న తోడు' పథకాన్ని అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించనుంది. చిన్న పాటి వ్యాపారాలు చేసుకునే వారికి సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు ఈ పథకం కిదం రూ.10 వేల వరకూ వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 6 నుంచి జులై 13 వరకు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తారు. 16వ తేదీ నుంచి 23 వరకు సామాజిక తనిఖీ నిమిత్తం సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: