భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం దాదాపుగా తగ్గింది. అరుణా చల్ ప్రదేశ్ సహా  గాల్వాన్ లోయ మాదే అంటూ చైనా కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భారత్ కూడా అదే స్థాయిలో చైనాకు సమాధానం ఇచ్చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ వెళ్ళడం భారత యుద్ద విమానాలు చైనా సరిహద్దుల్లో భారీగా మోహరించడం వంటివి జరిగాయి. 

 

ఇక భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్...  కూడా చైనా విదేశా౦గ శాఖా మంత్రితో కాస్త ఘాటుగానే మాట్లాడారు. అంతర్జాతీయంగా ఎండగడతాం అని అలాగే  వాణిజ్య ఇబ్బందులతో పాటుగా అమెరికా సహా మీకు పరోక్ష మిత్ర దేశాలుగా ఉన్న ఐరోపా దేశాల సహాయం తీసుకుంటామని ఆయన కాస్త ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో చైనా వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: