తిరుమల శ్రీవారి ఆలయంలపై ఇప్పుడు కేంద్రం జోక్యం ఉండే అవకాశం ఉందా...? ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు వస్తున్న వార్తలు అన్నీ కూడా ఇప్పుడు అదే అనుమానాలను కలిగిస్తున్నాయి అనే చెప్పాలి. తాజాగా బిజెపి ఎంపీ, తమిళనాడు సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఒక పోస్ట్  చేసారు. 

 

దీనికి తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. ఉత్తరాఖండ్‌ మాదిరిగానే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి లభించనుందని ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చార్‌దామ్‌ సహా 54 దేవాలయాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలనే పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉందని  సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మం అని దీక్షితులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: