అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి భారతీయులను తన వైపుకి తిప్పుకోవడానికి గానూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో కాస్త దూకుడుగా వెళ్తున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను ఆయన  జాగ్రత్తగా గమనించడమే కాదు అమెరికా అవసరం అయితే భారత్ కి సహాయం కూడా చేస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. 

 

ఇక దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకలను మోహరించడం కూడా  ఎన్నికలే ప్రధాన కారణం అని అంటున్నారు. చైనా విషయంలో తాము కూడా భారత్ కి అండగా ఉన్నామని ఈ విధంగా సంకేతాలు ఇచ్చారు ట్రంప్. దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ నిల్వల మీద చైనా కన్నేసింది అంటూ ఆయన ఇటీవల మీడియా సమావేశంలో కూడా వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: