ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  కరోనా వైరస్ కారణంగా వాయిదా వేస్తున్నామని  రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే ఈ పరిణామాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వాగతించారు. 2014-19 మధ్య కాలంలో కేంద్రం ఏపీకి 15 లక్షల ఇళ్లు కేటాయించిందని ఆయన ఒక లేఖ సిఎం జగన్ కు రాసారు. 

 

ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆయన గుర్తు చేసారు. కరోనా నేపధ్యంలో పట్టాలని వాయిదా వేయడం మంచి పరిణామం కాని దాదాపు నిర్మాణం పూర్తయిన 6 లక్షల టిడ్కోఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని తన లేఖలో సిఎం  జగన్ కు ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: