తెలంగాణ లో మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దాంతో ఆర్టీసీపై ఈ ప్రభావం బాగా పడింది.  ఇక తెలంగాణ సర్కార్ కరోనా ని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యవస్థలు మూసి వేయాలని చెప్పడంతో ఆర్థిక వ్యవస్థపై భారీగీ ప్రభావం చూపించింది. ఇక ఉద్యోగస్థులకు సగం జీతం.. పెన్షన్ దారులకు మొదట సగం కోత వేసినా.. తర్వాత నుంచి మూడొంతులు పెన్షన్ ఇచ్చారు.

 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా  మార్చి నుంచి సగం వేతనాలు వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి సగం వేతనాలు అందుకుంటున్న వారికి జూన్ నెల కోత లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియడం.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో.  

 

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లించడంతో.. ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న 49,733 మంది సిబ్బంది జీతాలకు గానూ సుమారు రూ. 160 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిపై అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: