తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణాలో భారీ వర్షాలు ఉత్తర తెలంగాణాలో పడే అవకాశం ఉంది అని వెల్లడించింది. ఖమ్మం జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు  పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

 

ఇక రాయలసీమ సహా ఉత్తర కోస్తా లో కూడా భారీ వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షాలు రాయలసీమ వ్యాప్తంగా పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణాలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: