అమెరికాలో కూడా టిక్ టాక్ బాన్ చెయ్యాలి అనే డిమాండ్ లు అక్కడి ప్రజల నుంచి వినపడుతున్నాయి. భారత్ లో ఏ విధంగా అయితే టిక్ టాక్ సహా చైనా యాప్స్ అన్నీ కూడా బాన్ చేసారో అక్కడ చెయ్యాలి అని పలువురు డిమాండ్ లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

చైనా యాప్స్ ని నిషేధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే తాము దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని వెల్లడించారు.  చైనా యాప్స్ ని యూరప్ దేశాలు కూడా నిషేధించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి మరి. చూడాలి ఎంత వరకో...

మరింత సమాచారం తెలుసుకోండి: