భారత్ లో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా పరీక్షలను వేగంగా చేస్తున్నారు. పరిక్షలు పెంచితే మినహా కేసులు కట్టడి అయ్యే అవకాశం లేదు అని భావిస్తున్న కేంద్రం పరిక్షల సంఖ్యను పెంచే విధంగా అడుగులు వేస్తుంది. ఇక ఇదిలా ఉంటే జూలై 6 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,02,11,092 అని ఐసి ఎం ఆర్ ప్రకటించింది. 

 

వీటిలో 2,41,430 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీలో అత్యధికంగా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా పరిక్షలు చేసారు. కాగా గత 24 గంటల్లో 22 వేల కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: