కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఈ మద్య కాలంలో వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్ సోకడంతో వారితో తిరిగినవారు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. వారితో పాటు గన్ మెన్, కారు డ్రైవర్, కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది. తాజాగా  ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు దినేష్ గూండూరావు ఇంట్లో పనిచేస్తున్న పీఏ, గన్ మెన్, మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వచ్చింది.

 

అస్వస్థతతో ఉన్న తాము కరోనా  పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని, అయినా తాము 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటున్నామని టబూ గూండూరావు చెప్పారు.  ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది.

 

అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,474కు చేరగా వారిలో మృతుల సంఖ్య 372గా నమోదైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: