కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించి నేటి నుంచి హైదరాబాద్ నిమ్స్ లో జరగాల్సిన క్లీనికల్ ట్రయల్స్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్  నిర్వహించడానికి గానూ ఐసిఎంఆర్ అనుమతి కోసం నిమ్స్ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అవి రెండు మూడు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. 

 

వ్యాక్సిన్ కి సంబంధించి ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ ట్రయల్స్ ని నిర్వహిస్తారు. ఐసిఎంఆర్ పర్యవేక్షణ లో ఈ ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది. అయితే ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ ని అందిస్తామని ఐసిఎంఆర్ చెప్పినా సరే అప్పటి లోగా ఇవ్వడం సాధ్యమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. 12 ప్రాంతాల్లో క్లీనికల్ ట్రయల్స్ ని నిర్వహిస్తుంది ఐసిఎంఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: