క‌రోనా వైర‌స్ మ‌న‌దేశంలో రోజుకు స‌గటున అధికారికంగానే 22 వేల మందికి సోకుతోంది. ఇక అన‌ధికారికంగా చూస్తే ఈ లెక్క చాలా ఎక్కువే ఉంటుంద‌ని అనుకోవాలి. ఇక ఇప్ప‌టికే 7.19 ల‌క్ష‌ల కేసుల‌తో మ‌న దేశం రష్యాను దాటేసి ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక గ‌త 24 గంట‌ల్లోనే మ‌న దేశంలో కొత్త కేసులు 24 వేల పైనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు 20 వేలు ఉన్నాయి. ఇక భార‌త్‌లో మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది.

 

క‌రోనా క‌మ్మేసిన మహారాష్ట్రలో 2.06 లక్షల కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడులో లక్షా 11వేల 151 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో 99 వేల 444 కరోనా కేసులున్నాయి. నాలుగో స్థానంలో గుజరాత్ ఉంది. ప్రధాని సొంత రాష్ట్రంలో 36వేల 37 మంది, పెద్ద రాష్ట్ర‌మైన‌ ఉత్తరప్రదేశ్‌లో 27 వేల 707 మంది, తెలంగాణలో 25 వేల 700 మంది, కర్నాటకలో 23వేల మంది, బెంగాల్‌లో 22వేల మంది, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లో 20వేల మంది కరోనా భారినపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: