గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ-కాశ్మీర్ లో రెచ్చిపోతున్నారు. ఉగ్రమూకలకు ధీటుగా భారత సైన్యం సమాధానం ఇస్తూనే ఉంది. గత ఏడాది పుల్వామా దాడిలో  40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు అమరులయ్యారు. అందుకు ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడి అంతమొందించింది. తాజాగా జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం పొందాడు.

 

పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ (28) ఉగ్రవాదులతో పోరాడి అమరుడయ్యారు. తాజాగా దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్   స్పందించారు.  దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరిన శ్రీనివాస్ చిన్నవయసులోనే అమరజీవి కావడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. 

 

చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు లాంటి గొప్ప వీరుడ్ని కోల్పోయిన కొద్దిరోజుల వ్యవధిలోనే తెలంగాణ శ్రీనివాస్ ను కూడా కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇక సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే కేసీఆర్ సర్కారు ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: