ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత లేకుండా చూడాలి అని సిఎం వైఎస్ జగన్ నేడు సమీక్షా సమావేశంలో అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఇసుక రీచ్‌ల్లోకి నీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టం చేసారు. ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి అని ఆయన ఆదేశించారు. 

 

ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇసుక బ్యాక్‌లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలని పేర్కొన్నారు. వచ్చే 10 రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేయాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశాలు జారీ చేసారు. ఇదే సమయంలో నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలన్న ఆయన... నాణ్యమైన ఇసుకను పంపిణీ చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలకు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: