ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల వ్యవహారంపై విపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉంది.  ఇప్పటికే ఇళ్ళ పట్టాలను అడ్డుకుంది  తెలుగుదేశం అనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. పేదలకు హౌసింగ్‌ అంటూనే వారి ఇళ్లు కూలుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు? అని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

టీడీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు కట్టించామన్న ఆయన... గ్రామీణ ప్రాంతాల్లో 2.5 నుంచి 3 సెంట్ల స్థలం ఇచ్చామని చెప్పారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారని ఆయన ఆరోపించారు. కరోనాను అదుపు చేయడం మానేసి రాజకీయ కక్షలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందన్నారు చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: