తెలంగాణా సచివాలయం కూల్చివేత పై ఇప్పుడు అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. కరోనా ఆస్పత్రిగా వాడుకునే అవకాశం ఉన్నా సరే ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా దీనిపై బిజెపి నేత డీకే అరుణ విమర్శలు చేసారు. 

 

సచివాలయం కూల్చివేత కేసీఆర్‌ ప్రభుత్వ ఉన్మాద చర్య అని ఆమె ఆరోపణలు చేసారు. ప్రజల ఆరోగ్యం కంటే సచివాలయం నిర్మాణమే ముఖ్యమా?  అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. సచివాలయానికే వెళ్లని కేసీఆర్‌కు నూతన సచివాలయం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేనప్పుడు, సచివాలయం ఎలా కడుతున్నారని  ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా ఆస్పత్రిగా మార్చాలి అని ఆమె సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: