ఈ మద్య చాలా మంది సున్నతమైన విషయాలకే మనసు వికలం చేసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఇక అత్తింటి వేధింపులు.. భర్త టార్చర్ భరించలేక కూడా కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సాగుతున్న తంతే. ఈ మద్య  భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ లావణ్య లహరి అత్తమామలు, ఆడపడుచులను ప్రకాశం జిల్లాలో శంషాబాద్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల  26 శంషాబాద్ పరిధిలోని రాళ్లపల్లిలో భర్త వేధింపులు భరించలేక లావణ్య అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 

లావణ్య ఆత్మహత్య తర్వాత భర్త, అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో భర్త వెంకటేష్, అత్తమామలు సుబ్బారావు, రమాదేవితో పాటు ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీ కుమారిలపై కేసు నమోదు అయ్యింది. తమపై కేసు నమోదు అయ్యిందన్న విషయం తెలుసుకొని అత్తింటి వారు కంటికి కనిపించకుండా పారిపోయారు.

 

వారిని పట్టుకోవడం కోసం శంషాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వరిమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని శంషాబాద్‌ పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: