కరోనా లాక్ డౌన్ లో విద్యార్ధులు నష్టపోకుండా కేంద్ర మానవనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 9 నుంచి 12 సిలబస్ ని 30 శాతం వరకు తగ్గించింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. 

 

దీనిపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబిఎస్‌ఇ బోర్డు అధికారులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా విద్యార్ధుల సిలబస్ పూర్తి కావడం లేదు అనే ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. విద్యార్ధుల భవిష్యత్తు క్రమంగా ప్రశ్నార్ధకంగా మారుతుంది. దీనితో సిలబస్ ని కేంద్రం తగ్గించాలి అనే డిమాండ్ సర్వత్రా వినపడుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: