దేశంలో మార్చి నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్నాయని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి సినీ పరిశ్రమ షట్ డౌన్ అయ్యింది. ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే సాధ్యమైనంత వరకు ఆయా ఇండస్ట్రీ పెద్దలు సినీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక థియేటర్లు మూతపడడంతో భారీ చిత్రాలు సైతం ఓటీటీ వేదికలపై రిలీజవుతున్న పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల సినిమా, టీవీ షూటింగులు మొదలైనా యూనిట్ సభ్యులకు కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

 

కాకపోతే మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ చిత్ర పరిశ్రమలోనూ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినోద రంగం పూర్వ వైభవం పుంజుకునేలా ఫిలిం మేకింగ్, టీవీ సీరియళ్లు, కో-ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ ఇలా అనేక రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని, ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు. 

 

ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో సినిమా షూటింగుల కోసం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) రూపొందిస్తున్నామని చెప్పారు.  కాగా, భారత్ లో చిత్రీకరణల కోసం ఇప్పటికే 80 మందికి పైగా విదేశీ నిర్మాతలు అను మతులు పొందారని, వాళ్లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చామని వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: