ఒక పక్క భారత్ చైనా సరిహద్దుల మధ్య  సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నా సరే కేంద్రం మాత్రం లడఖ్ ప్రాంతంలో చేపడుతున్న చర్యల విషయంలో వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. తాజాగా లడఖ్‌లో రూ .20,000 కోట్ల విలువైన రోడ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి భారత్ సిద్ధమైంది. రోడ్ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని  అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

 

వ్యూహాత్మక ప్రాంతాల్లో ఒకటి అయిన దుర్బూక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్‌ ని వేగంగా నిర్మించాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వ శాఖ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) అధికారులతో రాజనాథ్ సింగ్ ఇటీవల సమావేశమయ్యారు. రహదారి నిర్మాణాలతో పాటు, వాస్తవ వంతెన రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి 30 వంతెనలు కూడా నిర్మాణంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: