ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు కాస్త వేగంగానే పెరుగుతున్నా సరే అక్కడి  ప్రభుత్వాలు మాత్రం కేంద్రం మద్దతు ఉన్నా లేకపోయినా సరే కేసులను చాలా వరకు సమర్ధవంతంగా కట్టడి చేస్తున్నాయి. కరోనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అసోం సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 

 

ఆ రాష్ట్ర రాజధాని గౌహతిలో ప్రతీ ఇంటికి వెళ్లి కరోనా పరిక్షలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హిమాంత్ బిశ్వా శర్మ మీడియాకు వివరించారు. ఇప్పటి వరకు ఈ విధంగా పరిక్షలు చేయడం ఇదే తొలిసారి అని  నేటి నుంచి ఇలా చేస్తారు అని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో రెండు వార్డుల్లో 3 వేల పరిక్షలు తమ టార్గెట్ అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: