రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి అయోమయం పడుతున్న విషయం తెలిసిందే విద్యాసంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అని దానికి ఇంకా క్లారిటీ లేదు, దీనిపై  కొన్ని స్కూళ్ళు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాడు. తెలంగాణ ఏపీ  రాష్ట్రాలో  ఆన్లైన్ క్లాసులకి   అనుమతి లేదని స్పష్టం చేశారు. 

 

అయితే  స్టేట్ సిలబస్ స్కూల్ లు  కాస్త వెనక్కి తగ్గినప్పటికే సీబీఎస్ఈ  స్కూల్స్  మాత్రం ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తున్నారు. తాజాగా విద్యార్థులకు భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 30 శాతం సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 30 శాతం  సిలబస్ తగ్గిస్తున్నట్లు  కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: