దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ పక్కదారి పడితే లక్షలాది కుటుంబాల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని అన్నారు.

 

భారత దేశ ఆర్థిక వ్యవస్థ దుర్నిర్వహణ ఓ విషాదం. దీని ప్రభావం లక్షలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇకపై ఈ పరిస్థితిని చూస్తూ సహించేది లేదు. " అని పేర్కొన్నారు.కరోనా మహమ్మారి వల్ల 2020-21లో దేశ ఆర్థికాభివృద్ధి 4.5 శాతానికి తగ్గుతుందని తెలిపే ఓ నివేదికను ఈ ట్వీట్‌కు జత చేశారు రాహుల్. కొవిడ్ ప్రభావం వల్ల పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్​ వల్ల దేశంలో పేదరికం మరింత పెరిగిందని మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయంటూ రాహుల్​ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: