మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయానికి ముందుకొచ్చింది. గంగా ప్రక్షాళనకు సంబంధించి రూ.3,023.1 కోట్లు సాయం అందించనుంది.

 

ఇందులో రూ. 2,879 కోట్లు రుణంగా అందిస్తుంది ప్రపంచ బ్యాంకు. మిగతా రూ.143 కోట్లు బ్యాంకు గ్యారంటీ కింద వర్తిస్తుందని జాతీయ గంగా ప్రక్షాళన మిషన్​ వెల్లడించింది. ఈ ఒప్పందంపై ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్​, వరల్డ్ బ్యాంకులో భారత ప్రతినిధి కైజర్ ఖాన్​ సంతకం చేశారు.


ఆగ్రా, మేరఠ్, సహ్రాన్​పుర్​లోని గంగా ఉపనదుల (యమునా, కాళీ)పై కొత్త హైబ్రిడ్ యాన్యుటీ ప్రాజెక్టులకు రూ.1,134 కోట్లు ఖర్చు చేస్తారు.బక్సర్, ముంగేర్, బెగుసరాయిలోని ప్రాజెక్టులు; దిఘా, పట్నాలోని కంకర్బఘ్, హావ్​డా, బాలీ, బారానగర్ లోని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న 'డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్' పనులకు రూ.1,209.6 కోట్లను కేటాయిస్తారు.ఈ నిధులు గంగా ఫేస్​-2 లో సమకూరుతాయి. 2021 డిసెంబర్​ 31తో గంగా ఫేస్-1 పూర్తయ్యాక ఫేస్​-2 మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: