పాతికేళ్లుగా భారత అథ్లెటిక్స్​ ప్రధానకోచ్​గా పనిచేస్తోన్న బహదూర్​ సింగ్​.. ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ వయసు పరిమితుల ఆధారంగా కాంట్రాక్టు పొడిగింపును నిరాకరించడం వల్ల బహదూర్​ కోచ్​గా వైదొలిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1995లో కోచ్​గా జాతీయ శిబిరాల్లో చేరిన బహదూర్​.. 25 ఏళ్లపాటు సుదీర్ఘంగా కోచ్​గా వ్యవహరిస్తూ ఎక్కువ కాలం శిక్షకుడిగా పనిచేసిన ఘనతను సాధించారు​. జాతీయ శిక్షణా శిబిరాల్లో కోచ్​ల అత్యధిక వయసు పరిమితి 70కు మించి ఉండకూడదనే మార్గదర్శకాల ప్రకారం ఆ పదవిలో బహదూర్​ కొనసాగించడానికి నిరాకరించింది క్రీడా మంత్రిత్వశాఖ.

 

 

2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్​వెల్త్​ క్రీడల్లో భారత్​ రెండు స్వర్ణాలతో సహా 12 అథ్లెటిక్స్​ పతకాలు సాధించింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 8 బంగారు పతకాలు, 9 రజతాలతో పాటు ట్రాక్​, ఫీల్డ్​ పోటీల్లో​ 20 పతకాలు సాధించింది భారత్. విశ్వసనీయ సమాచారం మేరకు బహదూర్​ కోచ్​ పదవికి రాజీనామా చేసినా.. భారత అథ్లెటిక్స్​కు సలహాదారునిగా ఉంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: