బిక్రూ గ్రామ కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన ఘటనలో  ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్‌ను వెతుకుతూ ఫరీదాబాద్‌లోని ఒక హోటల్‌పై దాడి చేసిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ఎస్‌టిఎఫ్, హర్యానా పోలీసులు  వికాస్ దుబే ముగ్గురు సహాయకులను  అదుపులోకి తీసుకున్నారు.


 యుపి ఎస్టీఎఫ్ మంగళవారం సాయంత్రం దుబే  ఉన్న ప్రదేశం గురించి తెలుసుకుంది ,ఫరీదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది, కాని పోలీసులు చేరకముందే, దుబే, అతని నలుగురు సహాయకులతో కలిసి తప్పించుకొని పోయాడు.

 

 విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దుబే ఫరీదాబాద్‌లో దాక్కున్నాడు. ఢిల్లీ  కోర్టు ముందు లొంగిపోవాలని అనుకున్నాడు.  యుపి పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపుతారు అనే భయంతో దుబే పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.  అతను యుపి కోర్టు ముందు తన సరెండర్ అప్పీల్ గురించి భయపడుతున్నాడు, అందువల్ల అతను ఆ రాష్ట్రం వెలుపల కోర్టు ముందు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే  వికాస్ దుబే సమాచారం కోసం రూ .2.5 లక్షల రివార్డు ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: