ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో ఇతర దేశాలతో పోలిస్తే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో అక్కడ గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికాలో లాక్ డౌన్ విధించడానికి సిద్ధంగా లేమని ప్రకటన చేశారు. 
 
అమెరికాలోని పాఠశాలలను తెరవడానికి గవర్నర్ పై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం పోయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ట్రంప్ చెబుతున్నారు. లాక్ డౌన్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుండటంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: