ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని గ్యాంగ్ స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం వికాస్ దుబే అనే గ్యాంగ్ స్టర్ కొందరు కరుడు కట్టిన క్రిమినల్స్ తో పోలీసులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ఏడుగురు పోలీసులు మృతి చెందారు. కాల్పుల అనంతరం గ్యాంగ్ స్టర్ ముఠా తప్పించుకుంది. ఈ ఘటన అనంతరం యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్ స్టర్లపై ఉకుపాదం మోపుతున్నారు. 
 
రాష్ట్రంలో జాతీయ భద్రత చట్టం కింద గ్యాంగ్ స్టర్స్ పై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 67 కేసులతో సంబంధం ఉన్న 88 మంది గ్యాంగ్ స్టర్ లను యోగి ప్రభుత్వం ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. 2020 జనవరి నుంచి యూపీలో 1,899 కేసులు గ్యాంగ్ స్టర్స్ చట్టం కింద నమోదయ్యాయి. ఈ చట్టం ప్రకారం అధికారులు 26 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. గత వారం 127 ఆయుధ లైసెన్స్ లను కూడా ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: