సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో వేరువేరుగా ఏడుగురు దగ్గర నుంచి రూ.4.34లక్షలు కాజేశారు.ఒకరు ఓఎల్‌ఎక్స్‌లో బంక్‌ బెడ్‌ అమ్మేందుకు.. మరికొందరు బుల్లెట్‌, కారు కొనేందుకు.. ఇంకొకరు కస్టమర్‌కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌చేసి.. మరొకరు డేటింగ్‌ యాప్‌లో సభ్యత్వం తీసుకొని... ఇలా పలువురు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి తమ సొమ్మును సైబర్ కేటుగాళ్ల చేతిలో పడేశారు.  ఈ పైన ఘటనల్లో  బాధితులు మంగళవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

 

గోల్కొండకు చెందిన తాహెర్‌ అలీఖాన్‌ బుల్లెట్‌ కొనేందుకు ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో సైబర్‌నేరగాళ్లు పెట్టిన ఓ బుల్లెట్‌ విక్రయ ప్రకటన చూసి అందు లో ఉన్న ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాడు. అవతల నుంచి తాము ఆర్మీ సిబ్బంది అని.. మరో ప్రాంతానికి బదిలీ కావడంతో బుల్లెట్‌ను తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత అడ్వాన్స్‌  అంటూ బాధితుడి నుంచి రూ.1.02లక్షలు వసూలు చేశారు. ఇక తర్వాత అతను చేసిన ఫోన్ నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

 

సీతాఫల్‌మండికి చెందిన జీఫోర అనే మహిళ ఎయిర్‌టెల్‌ నంబర్‌కు రూ. 550 విలువైన రీచార్జి  చేసింది. అయి తే.. రీచార్జి యాక్టివేట్‌ కాకపోవడంతో ఆ సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో గాలించింది. అందులోని ఒక నంబర్‌ను సంప్రదించగా.. తాము ఎయిర్‌టెల్‌ ప్రతినిధులమంటూ నమ్మించారు. అనివార్య కారణాల వల్ల రీచార్జి కాలేదు.. మీ డబ్బులు మీకు పంపిస్తామని చెప్పి గూగుల్‌ డాక్స్‌ పంపించి.. ఆమె ద్వారానే బ్యాంక్‌ వివరాలు తెలుసుకొని.. బాధితురాలి ఖాతా నుంచి రూ. 54,500 కాజేశారు.


నారాయణగూడకు చెందిన విజయ్‌ స్కార్పియో కొనేందుకు ఓఎల్‌ఎక్స్‌లో వెతికాడు.ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల చేతికి బారినపడి  60 వేలు పోగొట్టుకున్నాడు.
 ఈ విధంగా ఏడుగురు దగ్గర్నుంచి వివిధ రకాలుగా లక్షల రూపాయలను కాజేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: