అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి(ఏఐసీటీఈ) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ) కోర్సును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరం నుంచి రెండేళ్ల కోర్సు అందుబాటులోకి వస్తుందని నిన్న ఏఐసీటీఈ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఎంసీఏ కోర్సు పూర్తి చేయాలంటే ఆరు సెమిస్టర్లు చదవాల్సి ఉండగా ప్రస్తుతం 4 సెమిస్టర్లు చదివితే సరిపోతుంది. 
 
రోజురోజుకు ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుంది. మూడేళ్ల పాటు చదవాల్సి ఉండటంతో ఈ కోర్సు పట్ల విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఏఐసీటీఈ కోర్సు కాలపరిమితిలో సవరణలు చేపట్టింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో ఈ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: