దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూటు మార్చి వైరస్ మనుషులను, ప్రజలను ఏమారుస్తోంది. కరోనా వైరస్ కు సంబంధించిన కొత్త లక్షణాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. వైద్యులు తాజాగా అరికాళ్లలో తిమ్మిర్లు, నత్తి, మూర్ఛ కూడా కరోనా లక్షణాలే అని చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. 
 
లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ కరోనా సోకకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐ.సీ,ఎం.ఆర్ పరిష్కార మార్గాల గురించి మరింత కసరత్తు చేస్తున్నాయి. ప్రజలు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: