ఈ మాయదారి కరోనా చిన్నా పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేదు ఎవరైనా నాకు సమానమే అంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. మొన్నటి వరకు ప్రజలకు రక్షణగా ఉంటూ వస్తున్న పోలీసులు, డాక్టర్లను వరసగా పొట్టన బెట్టుకుంటుంది. ఇక ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి కుటుంబం, సిబ్బందికి కరోనా పాజిటీవ్ ని తెలుతుంది. కొంతమంది కన్నుమూశారు. తాజాగా ఒడిషాకి చెందిన మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

 

దీంతో క‌రోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. తాజాగా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన ఎమ్మెల్యే క‌టక్ జిల్లాకు చెందిన నాయ‌కుడు. దీంతో ఆయ‌న‌ను ఆశ్విని కొవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక బిజెపి ఎమ్మెల్యే సుకాంత కుమార్ నాయ‌క్ కు సోమ‌వారం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. బాలాసోర్ లోని కొవిడ్ ఆస్ప‌త్రిలో బీజేపీ ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. ఒడిశాలో ఇప్ప‌టి వ‌ర‌కు 10,097 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 3,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వైర‌స్ నుంచి 6,703 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: