టీఆర్ఎస్ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు నిన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో కేటీఆర్ 307 మంది రైతులకు పట్టాలను పంపిణీ చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని అన్నారు. టీ ఫైబర్ సేవలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు త్వరలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు లేకపోయినా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతామని అన్నారు. రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. కరోనా కష్టకాలంలో రైతుబంధు పథకాన్ని అమలు చేసి కర్షకులకు లబ్ధి చేకూర్చామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: