దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ గురించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన కీలక ప్రకటన ప్రజలకు షాక్ ఇస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. గాలిలో కరోనా వైరస్ 8 గంటల పాటు బ్రతికి ఉంటుందని చెప్పారు. అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. 
 
గతంలో తుమ్మిన, దగ్గిన, ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రకటన చేసిన డబ్ల్యూహెచ్ఓ తాజాగా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పటంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని వందాలాది మంది డబ్ల్యూహెచ్ఓకు లేఖ రాయగా తాజాగా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి నిజమేనని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: