కరోనా  వైరస్ విజృంభిస్తున్న వేళ మనిషి జీవితం మరీ దారుణంగా మారిపోతుంది. తాజాగా వృద్ధురాలికి గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు... ఇక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడ సౌకర్యాలు బాగా ఉంటాయి అని చెప్పడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సదరు వృద్ధురాలికి కరోనా  వైరస్ లక్షణాలు కనిపించడంతో కరోనా  నిర్ధారిత పరీక్షలు చేశారు. 

 

 ఇక వృద్ధురాలికి  పాజిటివ్ వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. ఏకంగా వృద్ధురాలిని ఇంటికి పంపించేశారు ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది. మృతురాలికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ లో ఉండి పోయారు. ఇక బంధువులు హుటాహుటీన  బాధితురాలిని జిజీహెచ్ కి తరలించగా అక్కడ గుండెపోటుతో మృతి చెందింది వృద్ధురాలు తిరుపతమ్మ.  ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తమ తల్లి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి: