నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో మరో సారి జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషనర్గా మరోసారి నిమ్మగడ్డ పునర్ నియామకం చెల్లదు అంటూ ఏపీ  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన  సుప్రీంకోర్టు హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. 

 

 మధ్యంతరంగా ఎన్నికల కమిషనర్ను నియమించేలా గవర్నర్కు సూచించాలి అంటూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించగా... ఈ వాదనలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ కి ఇప్పుడే  సూచించలేమని..  రెండు నుంచి మూడు వారాల్లో విచారణ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం మాట్లాడ దలుచుకోలేదు అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది  సుప్రీం.

మరింత సమాచారం తెలుసుకోండి: