ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నట్లు సమాచారం. 35 ఏళ్లుగా జయంతి  ఆస్తమాతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

 

 అయితే ప్రస్తుతం వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటం తో వెంటనే హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. కాగా జయంతి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ మరాఠీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: