కన్నడ బుల్లితెర నటుడిగా పేరుప్రఖ్యాతులను తెచ్చుకున్న సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ మద్య చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే కన్నడ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన తన స్వస్థలం మండ్యలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సుశీల్ వయసు 30 ఏళ్లు. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ నటుడిగా పేరుతెచ్చుకున్న సుశీల్... సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మద్యనే దునియా విజయ్ నటించిన చిత్రంలో పోలీసు పాత్రలో నటించాడు.

 

అయితే, ఆ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ సందర్బంగా సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందించాడు. సుశీల్ ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నానని చెప్పారు. చిన్న చిన్న విషయాలకు ఒక సెలబ్రెటీ హోదాలో ఉండి ఇలా ఆత్మహత్యలకు పాల్పపడటం చాలా విషాదంగా ఉందని అన్నారు. ఆత్మహత్య దేనికీ సమాధానం కాదని చెప్పాడు. కరోనా భయం వల్లే కాక.. జీవించడానికి డబ్బు దొరకదనే నమ్మకాన్ని కోల్పోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నాడు. కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: