జీఎంఆర్ ఎయిర్​పోర్ట్స్ లిమిటెడ్​ (జీఏఎల్​)లో ఫ్రాన్స్​కు చెందిన గ్రూప్​​ ఏడీపీ రూ.4,565 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనితో జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో మొత్తం 49 శాతం వాటాను కైవసం చేసుకుంది గ్రూప్​ ఏడీపీ​.జీఏఎల్...​ ఢిల్లీ, హైదరాబాద్​ విమానాశ్రయాలను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ ఫిబ్రవరి 21న కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్​కు చెందిన గ్రూప్ ఏడీపీ... తమ కంపెనీలో 49 శాతం వాటాను రూ.10,780 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న మొదటి విడతగా రూ.5,248 కోట్లు చెల్లించి.. జీఏఎల్​లో 24.99 శాతం వాటాను కొనుగోలు చేసింది గ్రూప్ ఏడీపీ.

 

 

ప్రస్తుతం గ్రూప్​ ఏడీపీ నుంచి రెండో, చివరి పెట్టుబడి రూ.4,565 కోట్లు అందుకున్నట్లు జీఎంఆర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ స్పష్టం చేసింది. ఈ భారీ మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఫలితంగా సంస్థ క్యాష్ ఫ్లో, లాభదాయకత పెరుగుతాయని పేర్కొంది.ఈ ఒప్పందం ద్వారా జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారం నిర్వహణ, నియంత్రణలో.. గ్రూప్​ ఏడీపీకి హక్కులు కలుగుతాయి. అలాగే జీఏఎల్​ బోర్డులోనూ ప్రాతినిధ్యం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: