ఎస్​బీఐ స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్​ఆర్​ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడు నెలల కాలపరిమితి వరకు ఉండే స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఈ వడ్డీరేటు వర్తిస్తుంది. ఎస్​బీఐ ఎంసీఎల్​ఆర్​ను తగ్గించడం వరుసగా ఇది 14వ సారి.

 

భారతీయ స్టేట్​ బ్యాంకు వరుసగా 14వ సారి ఎంసీఎల్ఆర్​ను తగ్గించింది. స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్​ఆర్​ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 10 నుంచి ఈ తగ్గింపు అమలులోకి రానుంది.


మూడు నెలల కాలపరిమితి వరకు ఉండే స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఈ వడ్డీరేటు వర్తిస్తుంది. రుణ సామర్థ్యం పెంచడం, డిమాండ్ పునరుద్ధరించడమే లక్ష్యంగా ఎంసీఎల్​ఆర్​ను తగ్గించినట్లు ఎస్​బీఐ తెలిపింది.ఎంసీఎల్​ఆర్ తగ్గింపుతో... స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు సంవత్సరానికి 6.65 శాతానికి దిగిరానుంది. ఇది ఎక్స్​టర్నల్​ బెంచ్​మార్క్ ఆధారిత రుణరేటు (ఈబీఎల్​ఆర్​)కు సమానం.

మరింత సమాచారం తెలుసుకోండి: