కోలీవుడ్లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందిన సతీశ్​​.. అగ్రకథానాయకులు విజయ్​, శివ కార్తికేయన్​ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో శివ కార్తికేయన్​కు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.


దర్శకుడు అట్లీ రూపొందించిన 'ముగాపుతగం' లఘుచిత్రం షూటింగ్​లో శివ కార్తికేయన్​తో పరిచయం ఏర్పడినట్లు సతీశ్​ తెలిపాడు. అప్పటివరకు ఒకరికొకరు తెలియకపోయినా.. మొదటి రోజు చిత్రీకరణలోనే మంచి స్నేహితులమయ్యామని వెల్లడించాడు. లవర్స్​ లాగా గంటల తరబడి ఫోన్​లో మాట్లాడుకునేవారని.. ఒకరోజు తాను కాల్​ చేస్తుంటే 'నీ మొదటి భార్య కాల్​ చేస్తుందంటూ' శివ భార్య ఆర్తీ ఎగతాళి చేసిందని చెప్పాడు.శివ కార్తికేయన్​ నటించిన 'మెరీనా', 'ఎతిర్​ నీచల్​', 'రెమో', 'వెలైక్కరన్​' వంటి చిత్రాల్లో శివ కార్తికేయన్​తో పాటు హస్యనటుడు సతీశ్ నటించాడు​. సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'అణ్ణాత్త'లోనూ ఛాన్స్​ కొట్టేశాడు సతీశ్​.

 

మరింత సమాచారం తెలుసుకోండి: