నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్​లోని నెపోటిజమ్​ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వారిపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికీ బాలీవుడ్​ పరిశ్రమ సమాధానమివ్వాలని అన్నారు ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్​ బాజ్​పేయీ​. నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబివ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
చిత్రసీమలో నటులు ప్రజల అభిమానాన్ని ఎలాగైతే చూరగొంటారో.. అలానే వారి విమర్శలను కూడా స్వీకరించాలని అన్నారు. ఆ విమర్శల వెనుక గల కారణాన్ని తెలుసుకుని, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

దీంతో పాటే తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు మనోజ్​. అవే కష్టాలు సుశాంత్​కు ఎదురయ్యాయని అన్నారు. కానీ సుశాంత్​ సింగ్ ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయడం తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.సుశాంత్​-మనోజ్​ కలిసి 2019లో విడుదలైన 'సోంచిడియా' సినిమాలో నటించారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Don’t know what to add to this!! No no how can this be true??

A post shared by Manoj Bajpayee (@bajpayee.manoj) on

మరింత సమాచారం తెలుసుకోండి: