2028 లాస్​ ఏంజెలిస్​ ఒలింపిక్సే లక్ష్యంగా.. వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిపారు క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ఆ ఒలింపిక్స్​లో భారత్​ అధిక పతకాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకమైన పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రం ఒక్కో క్రీడపై ప్రత్యేక దృష్టి సారించి.. దానికి సంబంధించిన అథ్లెట్లను మరింత మెరుగ్గా ఆడేలా తీర్చిదిద్దాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలను కోరినట్లు వెల్లడించారు కిరణ్​. 

 


దీంతో పాటు మిగతా ఆటలను తమ శక్తి మేరకు ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ విధమైన వ్యూహత్మకమైన పద్ధతిని పాటించడం వల్ల టోక్యో ఒలింపిక్స్​లోనే కాకుండా ​2028 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్‌ పతకాల జాబితాలో భారత్ టాప్ -10లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు 14 క్రీడలను ఎంచుకుని వాటిపై పూర్తిస్థాయి దృష్టి సారించి కసరత్తులు చేస్తునాయన్నారు. అందులో రెజ్లింగ్​, ఆర్చరీ, బాక్సింగ్​, హాకీ, షూటింగ్​ తదితర క్రీడలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: