సమాచారం లీకేజీని అరికట్టడానికి గానూ ఫేస్‌బుక్, టిక్‌టాక్, టిండెర్,  పబ్ జీ, ఇన్‌స్టాగ్రామ్‌లతో సహా 89 యాప్‌లను తొలగించాలని భారత ఆర్మీ అధికారులు సైన్యానికి ఆదేశాలు జారీ చేసారు. వాటిల్లో చైనా యాప్స్ ఎక్కువగా ఉన్నాయి.  స్నాప్‌ చాట్, టిండెర్, ఓక్‌కుపిడ్, యుసి బ్రౌజర్, బంబుల్, షేర్‌ ఇట్, జెండర్, హెలో, కామ్‌ స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ మొదలైనవి ఆ 89 యాప్‌లలో ఉన్నాయి.

 

ఇటీవల భద్రతా కారణాలతో చైనాకు చెందిన 59 యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది ఆర్మీ. వీటిని తక్షణమే తొలగించాలి అని సైన్యానికి ఆదేశాలు ఇచ్చింది. ఇక పాకిస్తాన్ ఇప్పటికే భారత సైనికుల స్మార్ట్ ఫోన్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: