కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆందోళన లో ఉన్న విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ది అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ లేదా తులిప్‌ (TULIP) పేరిట ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను తాజా గ్రాడ్యుయేట్లకు అందిస్తుంది. 

 

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ద్వారా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాం ద్వారా మన దేశంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పని చేయడానికి గానూ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే దేశ వ్యాప్తంగా  23,970 సంస్థల్లో  మూడు లక్షల వరకు ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్న నేపధ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. దీనికో టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 2025 నాటికి కోటి ఇంటర్న్‌షిప్స్‌ కల్పించాలి అని. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ వారికి మాత్రమే ఉండే ఈ అవకాశం అన్ని వర్గాలకు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: