తెలంగాణ‌లో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో మ‌ళ్లీ సుదీర్ఘ‌మైన లాక్ డౌన్ ఉంటుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో పలువురు తీవ్ర ఆందోళ‌నోకి వెళ్లిపోయారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేవ‌ర‌కు లాక్ డౌన్ పెడితే ఎన్నో ర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని.. దీని వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ‌ల్ల కంటే లాక్ డౌన్ వల్లే ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించే ప్ర‌మాదం ఉంద‌ని కేటీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు స్వీయ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ ఇచ్చిన క్లారిటీతో హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ ఉండ‌న్న విష‌యంపై స్ప‌ష్టత వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: