గ్యాంగ్ స్టార్ వికాస్ దుబే విషయంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. అతన్ని ఎలా అయినా సరే పట్టుకోవాలి అని భావిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు... అతని గ్యాంగ్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే  అతని గ్యాంగ్ కి చెందిన ఒక వ్యక్తిని కాల్చి చంపారు. హర్యానాలో అతని ముగ్గురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

వారిని కాన్పూర్ కు తీసుకువచ్చేటప్పుడు కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన  ముగ్గురిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారు. నిన్న అమర్ దూబే అనే అనుచరుడ్ని కాల్చి చంపారు. మిగిలిన ఒకరిని ఫరీదాబాద్ (హర్యానా) లోని డిస్ట్రిక్ట్ ట్రాన్సిట్ రిమాండ్  కు పంపారు. అతని పేరు ప్రభాత్ మిశ్రా అని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: