భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కరోనా పరీక్షలను కూడా కాస్త వేగంగానే చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.  దేశంలో తాజాగా కరోనా పరిక్షల సంఖ్యను రికార్డ్ స్థాయిలో పెంచింది కేంద్రం. జూలై 8 వరకు మొత్తం 1,07,40,832 నమూనాలను పరీక్షించారని ఐసిఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 2,67,061 నమూనాలను నిన్న పరీక్షించారు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వివరించింది. 

 

ఇక  ఇప్పటి వరకు ఇదే  ఎక్కువ కరోనా పరిక్షలు చేయడం. ఇక కేసులు పెరిగే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఇప్పుడే తీవ్రంగా పెరుగుతుంది. కరోనా కర్ణాటక లో కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: